లేవండి, మేల్కొనండి! (స్వామి వివేకానంద యొక్క పూర్తి రచనలు)
తనకు సంప్రాప్తించిన జ్ఞాన సంపదతో తానే లాభం పొందాలనుకొంటాడు మానవుడు. కానీ, తనకు ప్రాప్తించిన జ్ఞానసంపద తనది కాదు. దానిని అందరికీ పంచవలెననే తీవ్రతపన కలవాడు స్వామి వివేకానందులు. ప్రతి చిన్న విషయాన్ని కూడా నిశితంగా పరీక్షించి మానవాభ్యుదయం కోసం మన దేశంలోనూ, దేశ దేశాలలోనూ అవిరామంగా తిరుగుతూ చేసిన మహోపన్యాసాల సమాహారమే ఈ గ్రంథం. ఇది పది సంపుటములుగా వెలువడిన అపూర్వ, అనితర సాధ్యమైన స్వామి వివేకానందుని మాటల సమాహారం. చివరి రెండు సంపుటములు వారు వివిధ ప్రాంతములందు ఉన్న తన సహచర మిత్రులకు వ్రాసిన లేఖల కూర్పు. ఒక అత్యున్నత భావాలు గల వ్యక్తి యొక్క ఆలోచన పరంపర ఎలా ఉంటుందో, అది తమకూ, సమాజానికీ, దేశానికీ ఎంత ఉపయోగకరమో ప్రతి విద్యార్థి, యువత, గృహస్థు తెలుసుకోవాలంటే ఈ గ్రంథ సముచ్చయమును తప్పక చదవాలి.
There are no reviews yet.