నా ఆత్మకథ ( స్వీయ వచనాల్లో స్వామి వివేకానంద జీవిత గాథ )
సాధారణ వ్యక్తుల విషయంలో స్వీయజీవిత కథలకు అంతగా ప్రాధాన్యత లేదేమో, కానీ మహాత్ముల ఆత్మ కథలు మాత్రం సత్యసంధత విషయంలో రాజీపడక విశ్వసనీయమై విరాజిల్లుతాయి. స్వామి వివేకానంద రచనలు, ప్రసంగాలు, లేఖలు, సంభాషణలలో తెలిపిన ఆకట్టుకునే వారి జీవిత విశేషాలు క్రోడీకరించి పుర్వాపర్యక్రమంలో అందమైన పూలదండవలె అమర్చినదే ‘నా ఆత్మకథ’. స్వామి వివేకానంద బాల్యం నుండి మహాసమాధి వరకు వారి సొంత మాటలలో సాగిన ఈ కథ, వారి జీవితంలోని విభిన్న ఘట్టాలను స్వామీజీయే స్వయంగా మన చేయి పుచ్చుకొని దర్శింపచేసిన అనుభూతిని కలిగిస్తుంది. ఆద్యంతం హృదయంగమంగా సాగి ప్రవహించే ఈ కథాస్రవంతి స్వామీజీ అశరీరవాణి మనతో ముఖాముఖి సంభాషిస్తున్న భావన కలిగించి మనస్సును ఉన్నత భూమికలకు కొనిపోతుంది.
saikumar.kota960 –
Good book
saikumar.kota960 –