వసిష్ఠ రామ సంవాదము
యోగవాసిష్ఠము, అఖండ రామాయణము అని వినుతికెక్కిన గ్రంథరాజమే ‘వసిష్ఠ రామ సంవాద’ రూపమున నాలుగు సంపుటములుగా ఆవిష్కరింపబడినది. అవతార పురుషుడు, ధర్మాత్ముడు అయిన శ్రీరామచంద్రునికి కలిగిన నిరాశా నిస్పృహలతో కూడిన వైరాగ్యము తొలగించి కార్యోన్ముఖుడిని కావించడానికి వసిష్ఠులవారు చేసిన ఫలవంతమైన ప్రయత్నమిది. ఇందులో బ్రహ్మజ్ఞానం, కర్మజ్ఞాన మార్గాలను రెండింటిని ఆచరిస్తేనే మోక్షము లభిస్తుందని తెలుపబడుతుంది. ఎంతో సున్నితము, జటిలము అయిన భావ పరంపర చక్కని సరళమైన తెలుగులో అనువదించబడింది. అందరికీ జ్ఞానమార్గాన్ని చూపే అమూల్యమైన గ్రంథమిది.
There are no reviews yet.