top of page

బ్రహ్మసూత్రాలలోని మొదటి నాలుగు సూత్రాలలో బ్రహ్మవిచారానికి సాధనసంపత్తిగలవారు అధికారులనీ, బ్రహ్మము, ఆత్మ అభిన్నమనీ, బ్రహ్మము సచ్చిదానంద స్వరూపమనీ, సర్వజ్ఞత్వ, సర్వశక్తిత్వములు గల జగత్కారణమనీ, వేదం అందుకు ప్రమాణమనీ, బ్రహ్మాత్మైక్యజ్ఞానమే మోక్షసాధనమనీ నిరూపించబడింది. ఈ మొదటి నాలుగు సూత్రాలకు 'చతుస్సూత్రీ' అని నామధేయం. సమస్త బ్రహ్మసూత్రాల సారం ఈ నాలుగు సూత్రాలలో నిక్షిప్తమై ఉండుట చతుస్సూత్రీ యొక్క ప్రాముఖ్యతను తేటతెల్లం చేస్తుంది.

ప్రస్తుత గ్రంథం, శ్రీ శంకర భగవత్పాదాచార్య విరచిత భాష్య సమేతంగా పూజ్య స్వామి తత్త్వవిదానంద సరస్వతి స్వామి వారిచే తమదైన శైలిలో రచించబడిన 'తత్త్వప్రకాశికా' అనే వివరణాత్మకమైన తెలుగు అనువాదంతో కూడినది. వేదాంత తత్త్వ విచారణాత్మకమైన ఈ గ్రంథానికి ఆంగ్లములో వివిధ అనుసృజనలు లభ్యమవుతున్నప్పటికీ, మాతృభాషలో చేసిన అనుసృజన బ్రహ్మతత్త్వాన్ని బాగా బోధపరచగలదని మా అభిప్రాయం. ముముక్షువులకే కాక సంస్కృత మూల వ్యాఖ్యానంతో సరిచూసుకుని తెలుగు అనుసృజనను అధ్యయనం చెయ్యాలనుకునే పాఠకులకు కూడా ఈ గ్రంథం చక్కని సహాయకారి కాగలదు. పూజ్య స్వామీజీ తేటతెలుగు భాషలో చేసిన ఈ అనుసృజనలో అనువైన చోట ఏదైనా విషయాన్ని మరింత స్పష్టం చెయ్యడం కోసం బ్రాకెట్లలో వివరించారు. అంతేగాక సంస్కృత భాష్యములో గల పదాల విభక్తి ప్రత్యయాలను పొల్లుపోకుండా అనువాదంలోనూ చక్కగా  ప్రతిఫలింపజేసారు. ఈ గ్రంథంలో అధస్సూచికల ద్వారా భాష్యాన్ని అర్థంచేసుకొనుటకు కావలసిన సంబంధిత పాణినిసూత్రాలు, న్యాయ, వేదాంత విషయాలను కూడా పొందుపరచారు. ఈ గ్రంథం వేదాంత జ్ఞాన పిపాసకులను, బ్రహ్మ జిజ్ఞాసువులను చల్లని  పానకము వలె సేదదీర్చి, వారికి అద్వైతసిద్ధిని చేకూర్చగలదని భావిస్తున్నాము.

Chatusutree

SKU: 9615
₹70.00Price
Quantity
  • Weight 170 g
    Language

    Telugu

    Author/By

    Swami Tattwavidananda Saraswati

    Publisher

    Ramakrishna Math, Hyderabad

    No. of Pages

    162

    Binding

    Paperback

    ISBN

    9789388549615

bottom of page