top of page

శ్రీ శారదా దేవి చరిత్ర

నేడు రామకృష్ణ సంఘ జననిగా పూజలందుకొంటున్న శ్రీ శారదాదేవి సంక్షిప్త జీవిత చిత్రణయే ఈ ‘శ్రీశారదాదేవి చరిత్ర’. “భారత నారీత్వ ఆదర్శాన్ని గూర్చి శ్రీరామకృష్ణుల పరమ సిద్ధాంతమే శ్రీ శారదాదేవి” అనే సోదరి నివేదిత మాటలు అక్షర సత్యమని ఈ పుస్తకం చదివిన వారు గ్రహించగలరు. ఆధునికత, ప్రాచీన ఆదర్శాలు శ్రీ శారదాదేవిలో ఎలా సమన్వయం పొందాయో, కష్టాలను, బాధలను భరించడం ఒక తపస్సుగా ఆమె ఎలా భావించిందో, సజ్జనులను, దుర్జనులను సమత్వ బుద్ధితో ఎలా చూడగలిగిందో, శ్రీరామకృష్ణులచే సాక్షాత్తు పరమేశ్వరీ స్వరూపంగా ఎందుకు, ఎలా ఆరాధింపబడిందో, చూసేవారికి గృహకృత్యాలు చేసుకొనే ఒక సామాన్య గృహిణిగా కనిపిస్తూ, ఉత్కృష్టమైన ఆధ్యాత్మిక స్థితిని పొంది ఎలా గురుదేవిగా నీరాజనాలందుకుందో, సర్వజీవులపై మాతృదేవిగా తన ప్రేమను ఎలా వర్షించిందో ఈ పుస్తకం చదివిన వారికి అవగతమౌతుంది. ఈ చరిత్రను ఒక సాధనగా చదివినవారికి, ధ్యానం చేసినవారికి అమ్మ సుగుణాలు, ఉదారదృష్టి అలవడతాయనడంలో సందేహం లేదు.

Sri Sarada Devi Charitra

SKU: 7118
₹50.00Price
  • Weight 160 g
    Book Author

    Swami Chirantanananda

    Pages

    224

    Binding

    Paperback

    Publisher

    Ramakrishna Math, Hyderabad

    ISBN / Barcode

    978-93-85243-08-0

bottom of page