top of page

నారాయణీయమ్ అనువాద వ్యాఖ్యానం పాఠకులకు తికమకలు లేకుండా సరళంగా ఇట్టే అర్థమయ్యే రీతిలో సాగాలనే ప్రయత్నంలో కృతకృత్యులమయ్యామని నమ్ముతున్నాం.

 

నారాయణీయమ్ మహాభాగవత సంగ్రహీకరణ కావడం వలన భాగవతంలో చోటుచేసుకొన్న విశేష భక్తి సిద్ధాంత అవగాహన నారాయణీయాన్ని అర్థం చేసుకోవడంలో, ప్రత్యేకించి కృష్ణావతార దశకాలలో ఎంతో ముఖ్యం. పఠించడానికి సుగమంగా ఉండాలనే ఉద్దేశంతోనే సంస్కృత శ్లోకాలలో (-) గుర్తు వాడడం జరిగింది.

చిత్తశుద్ధితో నారాయణీయమ్ పారాయణ చేసేవారికి క్లేశాలు నివారింపబడతాయని ప్రతీతి. విశ్వాసంతో, శ్రద్ధా భక్తులతో నారాయణీయమ్ పారాయణ చేసి శ్రీమన్నారాయణుని పట్ల తెలుగు పాఠకులు భక్తిని సంతరించుకొని జీవిత సాఫల్యం పొందగలరని మేము ఆకాంక్షిస్తున్నాం, ఆశిస్తున్నాం.

మద్రాస్ శ్రీరామకృష్ణ మఠ అధ్యక్షులుగాను, రామకృష్ణ సంఘ ఉపాధ్యక్షులుగాను సేవలందించిన వరిష్ఠ సన్యాసి, స్వామి తపస్యానందజీ మహారాజ్(1904-1991) అనేక హైందవ ప్రామాణిక గ్రంథాలను సంస్కృతం నుండి ఆంగ్లంలోకి  అనువదించారు. ‘శ్రీమన్నారాయణీయంఅను ప్రస్తుత తెలుగు అనువాద వ్యాఖ్యానం భాగవత సంగ్రహ భక్తి కావ్యమైననారాయణీయంఅనే గ్రంథానికి పూజ్య మహారాజ్ సంస్కృతం నుండి చేసిన సరళ ఆంగ్ల అనువాదం ఆధారంగా రూపొందించబడింది.

తాడేపల్లి పతంజలి గారిచే తెలుగులోనికి అనుసృజన చేయబడిన గ్రంథం రామకృష్ణ మఠం ద్వారా 171 శ్రీరామకృష్ణుల జయంతి సందర్భంగా 01-03-2006 తేదీన ప్రప్రథమంగా ప్రచురించబడి పాఠకుల ఆదరణను చూరగొన్నది. తదుపరి గ్రంథాన్ని మరింత సరళీకృతం చేస్తూ

డా అపర్ణా శ్రీనివాస్ గారిచే నూతనంగా అనుసృజన చేయబడింది.

పాఠకులు సదవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నారాయణుని భక్తిలో ఓలలాడి, తరించగలరని ఆకాంక్షిస్తూ...

SRIMANNARAYANEEYAM (TELUGU)

SKU: 9738
₹150.00Price
Quantity
bottom of page